- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాల్లో 1.5 శాతం కోతను ఒప్పుకోం
ఈహెచ్ఎస్ కోసం మే నెల నుంచే ఉద్యోగుల జీతాల నుండి 1.5 శాతం బేసిక్ పే కోత విధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) తీవ్రంగా ఖండించింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కోసం మే నెల నుంచే ఉద్యోగుల జీతాల నుండి 1.5 శాతం బేసిక్ పే కోత విధించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) తీవ్రంగా ఖండించింది. ఈ పథకాన్ని అమలు చేయడానికి ముందే దానికి సంబంధించిన టారిఫ్‌లు, చికిత్స ప్యాకేజీలు, నెట్‌వర్క్ ఆసుపత్రులు, అర్హత ప్రమాణాలు, అమలు విధానంపై స్పష్టమైన, పారదర్శకమైన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బేసిక్ పేలో 1.5 శాతం కోత విధించడం వల్ల రాష్ట్ర ఆర్పీఎస్-2020 స్కేల్ ప్రకారం ఒక కనిష్ఠ స్థాయి ఉద్యోగి జీతం నుండి నెలకు సుమారు రూ.195 కట్ అవుతుండగా, 7వ యూజీసీ పే రివిజన్ పరిధిలోని హెచ్ఏజీ స్కేల్ ఉన్నత అధికారి వేతనం నుంచి ఏకంగా రూ.3,750 వరకు కోత పడుతుందని వారు గణాంకాలతో వివరించారు.
దీనివల్ల ఉద్యోగులు చెల్లించే కంట్రిబ్యూషన్‌లో నెలకు రూ.3,500 కంటే ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తోందని పేర్కొన్నారు. సాధారణంగా ప్రైవేట్ ఆరోగ్య బీమా రంగంలో ప్రీమియం మొత్తంలో ఇలాంటి వ్యత్యాసాలు ఉన్నప్పుడు, వ్యక్తిగత ప్రీమియానికి తగినట్లుగా ప్రత్యేక ప్యాకేజీలు, అదనపు ప్రయోజనాలు కల్పిస్తారని... కానీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ హెల్త్ స్కీం విధానంలో అలాంటి భిన్నమైన బెనిఫిట్ నిర్మాణాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి పథకానికి సంబంధించిన అన్ని అస్పష్టతలను తొలగిస్తూ పారదర్శకమైన ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను ముందుగా విడుదల చేయాలని టీజీడీజీఏ డిమాండ్ చేసింది. అలాగే ఈ హెల్త్ స్కీమ్‌ను ఉద్యోగులందరికీ తప్పనిసరి చేయకుండా, ఎవరికి వారు నిర్ణయించుకునేలా ఆప్షనల్ పద్ధతిలోనే అమలు చేయాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. కిరణ్ బొల్లెపాక, సెక్రటరీ జనరల్ డా. కిరణ్ మాధాల, ట్రెజరర్ డా. ఎల్. రమేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.






