- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
రేవంత్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించిన కాసాని జ్ఞానేశ్వర్!
![రేవంత్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించిన కాసాని జ్ఞానేశ్వర్! రేవంత్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించిన కాసాని జ్ఞానేశ్వర్!](https://www.dishadaily.com/h-upload/2023/02/25/189167-kasani-gnaneshwar-revanth-.webp)
దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తనకు తల్లిపార్టీ లాంటిదని అభివర్ణించడంపై కాసాని స్పందించారు. టీడీపీ పార్టీని తన మాతృపార్టీగా అభివర్ణించడం సంతోషకరమని అయితే రేవంత్ రెడ్డి టీడీపీలోకి రావొచ్చు కాదా అని ఆహ్వానించారు. ఒకవేళ రేవంత్ రెడ్డి టీడీపీలోకి వస్తే స్వాగతిస్తామన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన కాసాని ఆదివారం నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
మార్చి 29న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామని ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు. 10 రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రాంతానికి ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీ పూర్వ వైభవం కోసం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.