Telangana TDP: సొంత గూటికి నటుడు బాబు మోహన్.. తిరిగి టీడీపీలో జాయిన్

by Ramesh Goud |   (  Updated:2024-10-29 07:04:29  IST  )

మాజీమంత్రి, నటుడు బాబు మోహన్(Actor Babu Mohan) టీడీపీ(TDP) సభ్యత్వం తీసుకున్నారు.

Telangana TDP: సొంత గూటికి నటుడు బాబు మోహన్.. తిరిగి టీడీపీలో జాయిన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి, నటుడు బాబు మోహన్(Actor Babu Mohan) టీడీపీ(TDP) సభ్యత్వం తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media) వేదికగా ఫోటోను షేర్ చేశారు. తెలంగాణ(Telangana)లో తెలుగు దేశం పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా అడ్‌హక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేపడుతోంది. అయితే గతంలో టీడీపీ నుంచి బయటకి వచ్చిన నటుడు బాబు మోహన్ తిరిగి పార్టీలో జాయిన్ అయ్యారు. మంగళవారం ఆందోల్ నియోజకవర్గం(Andole Constituency)లో టీడీపీ సభ్యత్యం తీసుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. కాగా ప్రముఖ కమీడియన్ గా ఉన్న బాబు మోహన్ టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2018 లో టీఆర్ఎస్(TRS)లో టికెట్ రాకపోవడంతో బీజేపీ(BJP)లో జాయిన్ అయ్యారు. తర్వాత 2023 లో బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రస్తుతం తిరిగి సొంత గూటికి చేరారు.


Next Story