- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్జెండర్లకు గుడ్‌న్యూస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ట్రాన్స్‌జెండర్‌ల సామాజిక, ఆర్థిక సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని శనివారం హైద్రాబాద్‌లోని గచ్చిబౌలి లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ట్రాన్స్‌జెండర్‌లకు గౌరవప్రదమైన జీవనం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్‌లను నియమించినట్లుగా ఆయన గుర్తుచేశారు. స్వయం ఉపాధికి దోహదపడేలా కార్ డ్రైవింగ్, హోటల్ మేనేజ్‌మెంట్, డ్రోన్ పైలట్ శిక్షణల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నామని మంత్రి అడ్లూరి పేర్కొన్నారు.
మారుతి డ్రైవింగ్ స్కూల్ సహకారం తో డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోందని, ఫోటోలు, వీడియోలు చిత్రీకరణతో పాటు వ్యవసాయంలో పిచికారీ, వివాహాలు మరియు ఇతర ఈవెంట్‌లలో విస్తృతంగా వినియోగం పెరిగిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ వివరించారు. ఈ శిక్షణతో ట్రాన్స్‌జెండర్‌లు భవిష్యత్ టెక్నాలజీ రంగంలో ముందుకు సాగవచ్చన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 91 మంది ట్రాన్స్‌జెండర్‌లు లబ్ధి పొందనుండగా, రూ.17.72 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ట్రాన్స్‌జెండర్‌లు సమాజంలో సమాన హక్కులతో ముందుకు సాగాలని, వారిని ఓటర్లుగా కాకుండా భాగస్వాములుగా గుర్తిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, పీడబ్ల్యూడీఎస్ అండ్ టీజీపీ డైరెక్టర్ శైలజ, నిథమ్ డైరెక్టర్ వి. వెంకట రమణ, రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ సెక్రటరీ అండ్ సీఈవో కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






