- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్నేహితుల్ని కాపాడి చనిపోయిన యువకుడు.. ఈత వచ్చినా నిలవని ప్రాణం
అమెరికాలోని లూసియానాలో తెలంగాణ యువకుడు అనూహ్య రీతిలో మరణించాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఈత బాగా వచ్చినా... ముగ్గురు స్నేహితుల్ని కాపాడిన తర్వాత చేప వలకు చిక్కుకుని ఓ యువకుడు మరణించాడు. ఈ విషాద ఘటన అమెరికాలోని లూసియానాలో జరిగింది. తెలుగువాసి అయిన అనురూప్ రెడ్డి.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన ఫ్రెండ్స్ ను కాపాడి.. విగతజీవిగా మారడంతో కుటుంబంలో, స్నేహితుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతనికాలు చేపలు పట్టే వలలో చిక్కుకోవడమే మృతికి ప్రధాన కారణమైనట్లు అక్కడి పోలీస్ వర్గాలు, రెస్క్యూ బృందాలు తెలిపాయి. రెస్క్యూ టీమ్ అనురూప్ రెడ్డి మృతదేహాన్ని 20 అడుగుల లోతులో నుంచి బయటకు తీసింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అనురూప్ రెడ్డి కుటుంబం.. ప్రస్తుతం హైదరాబాద్ లోని కవాడిగూడలో నివాసం ఉంటోంది. ఇటీవలే అనురూప్ నార్త్ టెక్సాస్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకున్నాడు. మే 29న తన ఫ్రెండ్స్ తో కలిసి టెక్సాస్, లూసియానా సరిహద్దుల్లో ఉన్న టొలెడో బెండ్ రిజర్వాయర్ కు పిక్ నిక్ కు వెళ్లాడు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో.. స్నేహితుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా.. వారిని కాపాడి అనురూప్ అనూహ్యరీతిలో మరణించాడు. దీంతో అతని బంధువులు, స్నేహితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అనురూప్ మరణవార్తతో కవాడిగూడలోని అతని నివాసంలో విషాదం అలుముకుంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.






