- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది.. హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో మద్యం దుకాణాలను పెంచడం పట్ల తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మద్యం దుకాణాలను పెంచడం పట్ల తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం పట్ల అక్కడి స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇటీవలే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి (Justice Vijaysen Reddy) ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలా ఇష్టానుసారంగా మద్యం దుకాణాలను పెంచుకుంటూ పోతే.. తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని కామెంట్ చేసింది. మద్యం దుకాణాల నియంత్రణపై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ.. విధానపరమైన నిర్ణయం తీసుకునే వరకు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇప్పటికే కనీసం రహదారిపైకి మద్యం దుకాణాలు కనిపించకుండా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నా పట్టించుకోరా అని ఫైర్ అయింది. ఇక నాగారం మున్సిపాలిటీ (Nagaram Municipality)లో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్, ఎక్సైజ్ అధికారులు, షాపు యజమానులకు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.






