పాస్‌పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ పోలీసులు టాప్

by Ajay Maddhiboyina |

పాస్‌పోర్ట్ ధృవీకరణలో రాష్ట్ర పోలీసులు దేశ వ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచారు. “గోల్డ్ స్టాండర్డ్” అవార్డుకు ఎంపికైనట్లు డీజీపీ కార్యాలయం నుంచి పత్రిక ప్రకటన సోమవారం వెలువడింది.

పాస్‌పోర్ట్ ధృవీకరణలో తెలంగాణ పోలీసులు టాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాస్‌పోర్ట్ ధృవీకరణలో రాష్ట్ర పోలీసులు దేశ వ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచారు. “గోల్డ్ స్టాండర్డ్” అవార్డుకు ఎంపికైనట్లు డీజీపీ కార్యాలయం నుంచి పత్రిక ప్రకటన సోమవారం వెలువడింది. ఈ అవార్డును పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా, నేడు న్యూ ఢిల్లీలో విదేశాంగ శాఖా మంత్రి చేతుల మీదుగా , డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బి. శివధర్ రెడ్డి ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రం అందుకోనున్నారు. ఈ విజయానికి కారణం రాష్ట్ర పోలీసులు అభివృద్ధి చేసిన VeriFast యాప్, అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నాయి. పాస్‌పోర్ట్ ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, ఖచ్చితంగా, పారదర్శకంగా అత్యుత్తమమైన ప్రజాప్రయోజనకారిగా రూపుదిద్దుకుందని వెల్లడించారు.

దేశం వ్యాప్తంగా అత్యంత వేగంగా మూడు పని దినాల్లోనే ఎక్కువశాతం కేసులలో పాస్‌పోర్ట్ ధృవీకరణ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రోజుకు సగటున 2000 పాస్ పోర్టుల ధృవీకరణ జరుగుతున్నట్లు , వార్షికంగా 8 లక్షలకు పైగా మంజూరు అవుతున్నట్లు పేర్కోన్నారు. VeriFast అండ్రాయిడ్ , ఐవోఎస్ , విండోస్ , లైనక్స్ అన్ని అపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ , ఇంటెలిజెన్స్ డేటాబేస్‌తో పాత నేరస్థులను గుర్తించడం జరుగుతుందన్నారు. VeriFast యాప్ రాష్ట్ర పోలీసుల సాంకేతిక వినియోగ సామర్థ్యానికి తలమానికంగా నిలుస్తోందని తెలిపారు. సాంకేతికత ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలకి ప్రతిబింబంగా ఉందని పేర్కొన్నారు.

Next Story