Telangana Assembly : తెలంగాణ రాష్ట్రం..శాసన సభ పరువు పోయింది : వేముల, గంగుల, తలసానిల ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

శాసన సభ(Telangana Assembly) ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందని(Sstarted And Was Postponed) ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదని..సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారని..తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింద(The State And The Legislature Have Lost Their Dignity)ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister and MLA Vemula Prashanth Reddy) విమర్శించారు.

Telangana Assembly : తెలంగాణ రాష్ట్రం..శాసన సభ పరువు పోయింది : వేముల, గంగుల, తలసానిల ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : శాసన సభ(Telangana Assembly) ఎన్నడూ లేని విధంగా ప్రారంభమై వాయిదా పడిందని(Sstarted And Was Postponed) ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఇలా జరగలేదని..సభ బిజినెస్ గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వాయిదా వేశారని..తెలంగాణ రాష్ట్రం ,శాసన సభ పరువు పోయింద(The State And The Legislature Have Lost Their Dignity)ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Former Minister and MLA Vemula Prashanth Reddy) విమర్శించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్ లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్(Gangula Kamalakar), తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav)లతో కలిసి మాట్లాడారు.

కేబినెట్ మీటింగ్ పూర్తి కాలేదని శాసన సభను వాయిదా వేస్తారా ? కేబినెట్ మీటింగ్ ,శాసన సభ సమావేశాల షెడ్యూల్ ముందే ఖరారు చేశారని..మళ్ళీ మార్పులు ఎందుకు చేశారని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క నిమిషం లోనే సభ ను వాయిదా వేసుకోవడాన్ని బీఆర్ఎస్ ఎల్పీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకు ఇచ్చే గౌరవం ఇదేనా ? బీసీ గణన పై చర్చ అని అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేస్తారా ? అని ప్రశ్నించారు. కేబినెట్ ముందు పెట్టకుండానే నిన్న కమిషన్ నివేదికను ఎందుకు బయట పెట్టారని నిలదీశారు. బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తోందని..మొదట్నుంచి కాంగ్రెస్ బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు. మా జీవితంలో ఈ తరహాలో అసెంబ్లీని చూడలేదని ఎద్దేవా చేశారు. బీసీ గణన తప్పుల తడక అని విమర్శించారు.

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ లో నూటికి తొంభై శాతం బడుగు ,బలహీన వర్గాలు ,దళితులు ,గిరిజనులు ,మైనారిటీలే ఉన్నారన్నారు. ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారన్నారు. సమావేశాల షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా ? కేబినెట్ సమావేశం నిన్న పెట్టుకుంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. మమ్మల్ని సభకు పిలిచి అవమానించారని..మంత్రి శ్రీధర్ బాబు చెప్పగానే ఒక్క నిమిషంలో సభను స్పీకర్ వాయిదా వేశారన్నారు. స్పీకర్ సభను వాయిదా వేసే ముందు మమ్మల్ని అడగరా అని ప్రశ్నించారు. సభను వాయిదా వేయడం కుట్ర పూరితమని..సభను ఒక రోజే నిర్వహించడం అన్యాయమని, నాలుగు రోజులు అయినా సభ పెట్టాలని, బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీసీలు చైతన్యవంతులని. కేసీఆర్ ఏం చేశారో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారని..బీసీల కోసం మరో ఉద్యమం రాబోతోందన్నారు. తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోందన్నారు.

Next Story