హైకోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

హైకోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం
X

దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం రాష్ట్ర హైకోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. పోలీసు బలగాలు ప్రత్యేక గౌరవ వందనంతో చీఫ్‌ జస్టిస్‌ పి.సామ్ కోషీ కు స్వాగతం పలికాయి. అనంతరం ఈ సందర్భంగా హైకోర్టు ఆవరణలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్ కోషీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టుకు చెందిన పలువురు ఇతర న్యాయమూర్తులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.జెండా ఆవిష్కరణ అనంతరం హైకోర్టు లాన్స్‌లో ఆహుతులందరికీ తేనీటి విందు ఏర్పాటు చేశారు.

ఈ వేడుకల్లో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు రిజిస్ట్రీ సిబ్బంది, అడ్వకేట్స్ అసోసియేషన్ నుంచి వైస్ ప్రెసిడెంట్ డి.ఎల్.పాండు, కార్యదర్శులు పి.శ్రావణ్ కుమార్ గౌడ్, కె.నిరంజన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ పి.కృష్ణ కీర్తన, కోశాధికారి బాలాజీ బానోత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ జయసూర్య, వీరితో పాటు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కృష్ణ కుమార్ నాగులూరి, కొండా రెడ్డి జక్కా, రుక్మిణి పల్లెల, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శిల్పా గెల్లి, భార్గవి కావలి, అరవింద్ కుమార్ గాడి, పూల్ సింగ్ నాయక్ రామావత్, రవి పొనంపెల్లి అసోసియేషన్ కార్యదర్శి కె.నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story