జంతర్ మంతర్: కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కేపై ఇంక్ దాడి

by Malleboina Mahesh |

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కేపై సిరా (Ink) దాడి చేసిన మహిళ, రంగంలోకి దిగిన పోలీసులు!

జంతర్ మంతర్: కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దిప్కేపై ఇంక్ దాడి
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన వేదిక వద్ద శనివారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే లక్ష్యంగా ఒక మహిళ అనూహ్యంగా సిరా (Ink) విసిరింది. జంతర్ మంతర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.

నిరసన స్థలంలో గందరగోళం..

ఓ యువతి ఒక్కసారిగా సిరా విసరడంతో అభిజీత్ దిప్కే ముఖం, బట్టలపై సిరా మరకలు పడ్డాయి. ఈ హఠాత్ పరిణామం తో నిరసన ప్రాంగణంలో ఒక్కసారిగా గందరగోళం, నెట్టుకోవడాలు చోటుచేసుకున్నాయి. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది, పోలీసులు తక్షణమే స్పందించి సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. లడఖ్ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడి జరిగిందంటూ అంతకుముందే అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు చేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం. ఈ సిరా దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సదరు మహిళను విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా సిరా దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story