ఉత్తర అమెరికాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక

by Muthe.Rajitha |

ఉత్తర అమెరికాలోని నార్త్ కరోలినా క్యారీ పట్టణంలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (టీటీజీఏ ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని అసోసియేషన్​శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఉత్తర అమెరికాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుక
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉత్తర అమెరికాలోని నార్త్ కరోలినా క్యారీ పట్టణంలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (టీటీజీఏ ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని అసోసియేషన్​శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమానికి 100 మందికి పైగా సభ్యులు హాజరై తెలంగాణ రాష్ట్రం పట్ల తమ ప్రేమను, గౌరవాన్ని చాటారని వెల్లడించింది. తొలుత ఈ కార్యక్రమం భారతదేశం , అమెరికా ల జాతీయ గీతాలతో ప్రారంభమై తెలంగాణ రాష్ట్ర గీతం , సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాల తో ఉత్సాహంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగాయని తెలిపింది.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తెలంగాణ అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించారని పేర్కొంది. టీటీజీఏ అధ్యక్షురాలు భారతి వెంకన్న , బోర్డు సభ్యులు, మోరిస్ విల్లె మేయర్, కౌన్సిల్ సభ్యులు టీటీజీఏ మద్దతుదారులు పాల్గొని ఈ వేడుకను మరింత వైభవంగా మార్చారని తెలిపింది.

Next Story