తెలంగాణ ST ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-05 11:46:31  IST  )

తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ST ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గిరిజన ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌ వద్దనున్న దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంత్రి సీతక్క(Minister Seethakka), ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellaiah Naik) ఆధ్వర్యంలో ఎస్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు(Telangana ST MLAs) సమావేశం అయ్యారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

= మూడు ఎస్టీ కార్పొరేషన్లను బలోపేతం చేయాలి

= ఐటీడీఏ పరిధిలో ఉన్న 29 ప్రభుత్వ శాఖలను పటిష్ట పరచాలి

= హైదరాబాదులో 2 పోస్ట్ మెట్రిక్ గిరిజన హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి

= ఎస్టీ విద్యార్థుల కోసం అదనంగా 250 ఓవర్సీస్ స్కాలర్షిప్‌లు మంజూరు చేయాలి

= సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం జిల్లాలకు ప్రత్యేక అధికారులను కేటాయించాలి

= ST అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిరిజన సంక్షేమ భవనాలు నిర్మించాలి

= ఐటీడీఏ పరిధిలో 15 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి

= గిరిజన ప్రాంతాల్లో యూత్ ట్రైనింగ్ సెంటర్‌ల బలోపేతం కోసం చర్యలు

= మైదాన ప్రాంతాల కోసం కొత్తగా ఐటీడీఏను ఏర్పాటు చేయాలి

= ఎస్టీ వసతిగృహాల్లో గీజర్లు, వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేయాలి

= అవసరం ఉన్న మండలాల్లో ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయాలి

= ఆశ్రమ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ విద్యను బోధించాలి

= ఇందిరమ్మ గిరి వికాసంను పునరుద్ధరించాలి

= ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలి

= ఏజెన్సీ ఏరియాలో మాతృభాషలో విద్యా బోధన జరిగేలా చర్యలు చేపట్టాలి

= ఏజెన్సీ ప్రాంతాల్లో కళాశాలలో రెగ్యులర్ టీచర్లను పని చేయాలి

= గిరిజనులకు వంద కోట్ల ట్రైకార్ సబ్సిడీ నిధులను తక్షణం విడుదల చేయాలి

ఈ సమావేశంలో ఎంపీ బలరాం నాయక్, విప్ రామచంద్రనాయక్, ఎమ్మెల్యేలు మురళి నాయక్, రామ్ దాస్ నాయక్, వెడ్మ బొజ్జు, జాలే ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లాం వెంకట్రావు.. బీఆర్ఎస్ తరపున కోవాలక్ష్మి, అనిల్ జాథవ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, గిరిజన సంక్షేమ శాఖ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story