- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రీడల అభివృద్దికి కేంద్రం తీసుకునే నిర్ణయానికి మద్దతు ఇస్తాం : మంత్రి వాకిటి శ్రీహరి
క్రీడల అభివృద్ధి కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని రాష్ర్ట యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

- ఖేలో ఇండియా నుంచి తెలంగాణకు నిధులు కేటాయించాలి
దిశ, తెలంగాణ బ్యూరో : క్రీడల అభివృద్ధి కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని రాష్ర్ట యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఇప్పటికే క్రీడల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఖేలో ఇండియా నుంచి తెలంగాణకు అధిక నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరారు. ఆదివారం జమ్ముకాశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించే ఖేలో ఇండియా– చింతన్శివిర్లో మాట్లాడుతూ క్రీడల్లో భారత్ ను గ్లోబల్ గా అగ్రగామిగా నిలపాలని నిర్ణయించామని, క్రీడలకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని సంకల్ప పత్రాన్ని విడుదల చేశామన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి పాల్గొన్నారు.






