- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు వెలువరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయడానికి స్పీకర్ నిరాకరించారు. వీరు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. దీంతో అనర్హత వేటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లైంది.
కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించారు. కాగా రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ తీర్పును ప్రకటించనున్నారు. అనర్హత పిటిషన్ల కేసులో ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుంది.






