- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ యూనివర్శిటీ ఉపకేంద్రాలు
ఉద్యోగ అవకాశాలు కల్పించేలా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని, 33 జిల్లాల్లో స్కిల్ యూనివర్శిటీ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అప్పుడే యువతకు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ అవకాశాలు కల్పించేలా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశామని, 33 జిల్లాల్లో స్కిల్ యూనివర్శిటీ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అప్పుడే యువతకు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కేవలం నగరాలకే పరిమితం కాకూడదని, ప్రతి జిల్లాకు పరిశ్రమలు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎక్కడైతే నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉంటారో, అక్కడ ఆయా రంగాలకు సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. శాసనమండలిలో సభ్యులు మధుసూధన్ చారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో ఈ జిల్లాలో 133 యూనిట్లకు టీజీ-పాస్ అనుమతులు ఇచ్చామని, దీంతో రూ.112 కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా 1,518 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే, గత రెండేళ్లలో 5,067 యూనిట్లకు అనుమతులు మంజూరు చేశామన్నారు.
వీటి ద్వారా వివిధ దశల్లో 1,82,121 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని మంత్రి వివరించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు. అలాంటి అధికారిక సమాచారం ఏదీ లేదన్నారు. అయితే, ఐటీ, సెమీ కండక్టర్ల రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల పట్ల ప్రత్యేక ఆసక్తి చూపిస్తోందని విమర్శించారు. మన దగ్గర అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉన్నప్పటికీ, కేంద్రం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పాలసీలను కొనసాగిస్తామని, వరంగల్ జిల్లాలోని పీఎం మిత్రా టెక్స్‌టైల్ పార్క్ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కిటెక్స్, యంగ్ వన్, గణేశా వంటి సంస్థలకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు మంజూరు చేశామని, తెలంగాణ ప్రగతే తమ లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో స్కిల్ యూనివర్శిటీ ఉపకేంద్రాలను ఏర్పాటు చేస్తాం. అప్పుడే యువతకు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలు అందిస్తామన్నారు. హిల్ట్ పాలసీ గైడ్లైన్స్ అంశాలను కార్మిక సంఘాలతో, యాజమాన్యాలతో చర్చిస్తాం. కార్మికులకు సంబంధించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కార్యాచరణ రూపొందించామన్నారు.
ఐటీ పార్కుల వల్ల 10 శాతం ఉపయోగం లేదు..
స్కిల్ యూనివర్శిటీకి సంబంధించిన విషయాలను మంత్రి ప్రస్తావించిన సమయంలో ఐటీ పార్కుల వల్ల 10 శాతం ఉపయోగం లేదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రికి సూచించారు. ఐటీ పార్కులకు సంబంధించి మంత్రి మాట్లాడుతూ నిజమామాబాద్, ఆదిలాబాద్ లో అతి త్వరలో ప్రారంభిస్తాం. ఖమ్మంలో ఐటీ పార్కు విజయవంతంగా నడుస్తోందన్నారు. ఐటీ పార్కులకు సంబంధించి ఇన్సెంటివ్స్ ఇచ్చే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.






