TS: పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. SI, ASI పరీక్షల తేదీలు ఖరారు

by Disha Web Desk 2 |
TS: పోలీస్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. SI, ASI పరీక్షల తేదీలు ఖరారు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఐ, ఏఏస్ఐ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష తేదీలు వెలువడ్డాయి. ఏప్రిల్ 8, 9వ తేదీలలో ఈ రాతపరీక్షలను నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నిర్ణయించింది. ఈ రెండు పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది.

ఎస్ సిటీ ఎస్ఐ (సివిల్) పోస్టులకు ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జనరల్ స్టడీస్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా సమస్యలు ఎదురైతే [email protected] లేదా 9393711110/9391005006 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

Next Story

Most Viewed