Bhatti : గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీడర్ గా నిలపాలి : భట్టి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-14 09:32:58  IST  )

గ్రీన్ ఎనర్జీ రంగం(Green Energy Sector)లో తెలంగాణను లీడర్ (Telangana As A Leader)గా నిలపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(DCM Bhatti Vikramarka) పిలుపునిచ్చారు.

Bhatti : గ్రీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణను లీడర్ గా నిలపాలి : భట్టి
X

దిశ, వెబ్ డెస్క్ :గ్రీన్ ఎనర్జీ రంగం(Green Energy Sector)లో తెలంగాణను లీడర్ (Telangana As A Leader)గా నిలపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(DCM Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్(NABARD State Focus Paper) ఆవిష్కరణ చేసిన భట్టి ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని..రాష్ట్ర స్థూల ఉత్పత్తి (Gsdp) 15.02 లక్షల కోట్లు, వృద్ధిరేటు 14.5శాతంగా ఉందని.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలుగా ఉందని తెలిపారు.

అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా రైతులు, సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తున్నామన్నదే మెరుగైన ప్రయాణం అని భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భాగస్వామిగా ఉందని రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని..భూగర్భ జల వనరులు పెరిగాయని, హైదరాబాద్ పరిసరాల్లో పూల సాగును నాబార్డు ప్రోత్సహించాలని కోరారు.

రైతాంగానికి ఇచ్చే ఆర్థిక సహాయం గ్రామీణాభివృద్ధికి..దేశ వృద్ధికి తోడ్పతుందన్నారు. గత పది సంవత్సరాలు సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారని..ఐకేపీల ద్వారా ఆర్గానిక్ సాగును ప్రోత్సహించాలని, వ్యవసాయ పంపు సెట్లు క్రమంగా సోలార్ పవర్ పంపుసెట్లుగా మార్చేందుకు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు రుణాల పట్ల బ్యాంకర్ల తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ రైతు అప్పు తీర్చలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేట్‌ను తీసేస్తే.. మరి వేల కోట్లు తీసుకుని ఎగవేసిన వారిని మీరు ఏం చేస్తున్నారని ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story