అమ్మో చలి.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-09 02:20:31  IST  )

తెలంగాణను చలి వణికిస్తోంది. రాత్రి, ఉదయం వేళల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే..

అమ్మో చలి.. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో.. 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను చలి వణికిస్తోంది. రాత్రి, ఉదయం వేళల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతుండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వెటర్లు, బెడ్ షీట్లు కప్పుకున్నా చలి ఆగని పరిస్థితులు కూడా ఉన్నాయి. గడిచిన 10-15 ఏళ్లలో చూస్తే.. 2014 డిసెంబర్ 28న అత్యల్పంగా KB ఆసిఫాబాద్ లో 1.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. 2015 జనవరి 10న KB ఆసిఫాబాద్ లోనే అత్యల్పంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆ తర్వాత 2018-19 సంవత్సరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మళ్లీ ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో ఆ స్థాయిలో చలి తీవ్రత ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. మున్ముందు తీవ్రమైన చలిగాలులు ఉంటాయని తెలిపారు.

సంగారెడ్డి కోహిర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డిలోనే 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10డిగ్రీలలోపే నమోదయ్యాయి. మెదక్ జిల్లా శివ్వంపేటలో 8.4, సిద్ధిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 7.4 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధరిలో 8.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతల రికార్డయ్యాయి. హైదరాబాద్ లోను చలి పంజా విసురుతోంది. మరో 3-4 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

7 జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాష్ట్రంలో చలితీవ్రంగా ఉండటంతో భారత వాతావరణశాఖ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోతాయని పేర్కొంది.

Read More..

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలను వణికిస్తున్న చలి

Next Story