పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలను వణికిస్తున్న చలి

by Malleboina Mahesh |

ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రజలు గజ గజా వణుకుతున్నారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజలను వణికిస్తున్న చలి
X

దిశ, ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతుంది. చలి తీవ్రత పెరగడంతో ఏజెన్సీ ప్రజలు గజ గజా వణుకుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పేరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. బయటకు వెళ్లంటే గజగజ అనుకుతు వెళ్లాల్సిందే. ఉదయం లేద్దమంటే చలి విరుచుకుపడుతోంది. పోద్దెక్కే వరకు చలి అల్లాడిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటుగా ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. రోజు రోజు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితో ఊ.. ఆ.. అంటూ గిరిజనులు అల్లాడుతున్నారు. ఉత్తరాది ప్రాంతాల నుంచి చలి గాలులు వీస్తుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని అత్యల్పంగా 8, బజార్ హత్నూర్ లో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు కాగా సింగిల్ డిజిట్ స్థాయిలో చలి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో చలి తీవ్రత ఎ మేరకు ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

సాయంత్రం నుంచి ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. మద్యాహ్న వేళ తప్ప మిగతా సహయాల్లో ఎండ ప్రభావం అంతగా లేదు. దీంతో ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి కారణంగా మన్యం ప్రాంతంలో గిరిజనులు ఇళ్ల ముందు నేగడి(అగ్గి) చలి మంటల వద్ద వెచ్చదనం కోసం కూర్చుంటున్నారు. ఏజెన్సీలో తెల్లవారుజామున కురుస్తున్న పొగ మంచుతో బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. చలి ఈ నెలలో ఈ స్థాయిలో ఉందంటే జనవరి నెలలో ఇంకేంత చలి ఉంటుందోని ప్రజలు జంకుతున్నారు. చలి భయంతో ప్రజలను బెంబేలెత్తిస్తుంది.

ఒకే సారి చలి తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. నీటి ప్రాంతాలు ఉన్న చోట మరింత చలి ఎక్కువగా ఉంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట సైతం స్వేటర్లు, దుప్పట్లు కప్పుకుని పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివారం అర్లీలో 8, బజార్హత్నూర్ 8.5, పొచ్చేర 8.7, సాత్నాల 8.8, కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తీర్యాణిలో 9.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో సైతం ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

సీజనల్ వ్యాధులు

చలి తీవ్రత కారణంగా సీజనల్ వ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తమా వ్యాధి గ్రస్థులు జాగ్రత్తగా ఉండాలని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రతతో పెద్దలు, చిన్నారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం, రాత్రిళ్లు సమయంలో భయటకు వెళ్లే వారు, ఉద్యోగాల నుంచి ఇంటికి వచ్చే వారు, తెల్లవారుజామున ఇంటింటికి వెల్లే పేపర్ బాయ్లు, వాకింక్ వెల్లే ప్రజలు, పంచాయతీ కార్మికులు, రైతులు చలి భయంతో వణికిపోతున్నారు.

జాగ్రత్తలు అవసరం

చలి తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా సమస్యలు ఉన్న వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే హాస్పిటల్ కి రావాలి. చలి కారణంగా ఉదయం, రాత్రి వేళల్లో తిరగవద్దు. వయస్సు పైబడిన వారు చలిలో బయటకు వస్తే పెరాలసిస్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లలు, పెద్దలు మరింత అప్రమత్తంగా ఉండాలి.:-డాక్టర్ జాదవ్ ఉపేందర్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆస్పత్రి ఉట్నూర్

Next Story