- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజారుద్దీన్‌కు మంత్రిపదవి.. కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ఎస్ఈవో లేఖ
by Muthe.Rajitha |
కాంగ్రెస్ మైనార్టీ నేత అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ మైనార్టీ నేత అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేథ్యంలో మైనార్టీ నేతకు మంత్రి పదవి కట్టబెట్టడం ఓటర్లపై ప్రభావం చూపుతుందని, ఈ కేబినెట్ విస్తరణను తక్షణమే ఆపివేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై క్లారిటీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ సీఈసీ దీనిపై అభ్యంతరం తెలిపితే అజారుద్దీన్ మంత్రి పదవికి బ్రేక్ పడ్డట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Next Story






