- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GO 21: జీఓ 21 వెంటనే రద్దు చేయాల్సిందే.. తెలంగాణ సచివాలయ ముట్టడి ఉద్రిక్తత
జీఓ 21 వెంటనే రద్దు చేయాలని వివిధ యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జీఓ 21 వెంటనే రద్దు చేయాలని వివిధ యూనివర్సిటీల పార్ట్ టైం ఉద్యోగులు డిమాండ్ చేశారు. నేపథ్యంలోనే తెలంగాణ సెక్రటేరియట్ (Telangana Secretariat siege) ముట్టడికి యత్నించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పలువులు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్ట్ టైమ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వివిధ వర్సిటీల పార్ట్‌టైమ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాతే.. యూనివర్సిటీలో రిక్రూట్ మెంట్ చేపట్టాలని, లేదంటే ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
కాగా, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాల విధివిధానాలపై తీసుకొచ్చిన జీవో 21ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తోంది. 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని, యూజీసీ పే స్కేల్స్ వర్తింప చేసిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 12 విశ్వవిద్యాలయాల్లో 1270 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా కొనసాగుతున్నారని, తమను క్రమబద్ధీకరించిన తర్వాతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.






