Telangana Secretariat: రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాట్ల పనులపై మంత్రుల సూచనలు

by Ramesh Goud |   ( Updated:2024-08-16 15:00:31.0  )
Telangana Secretariat: రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాట్ల పనులపై మంత్రుల సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లకు సంబందించిన పెండింగ్ పనులను మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈ నెల 20 వ తేదిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఏర్పాటు చేస్తున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి సంబందించిన పెండింగ్ పనులను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు.

రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణ మ్యాప్ ను పరిశీలించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి పలు సూచనలు చేశారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్ సహా ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 14న రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.

Advertisement

Next Story