- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆఫీసర్ల పాలనకు తెర.. నేడు సర్పంచ్ ల ప్రమాణ స్వీకారోత్సవం
గ్రామపంచాయతీలకు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న కొత్త పాలకవర్గాలు నేడు కొలువు దీరనున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామపంచాయతీలకు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న కొత్త పాలకవర్గాలు నేడు కొలువు దీరనున్నాయి. రాష్ట్రంలో 22 నెలల సుదీర్ఘ ప్రత్యేక అధికారుల పాలనకు తెరపడనుంది. ఇటీవల ఎన్నికల సర్పంచ్ లు చేత సోమవారం ఉదయం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం అభినందనలు, శుభాకాంక్షల అనంతరం గ్రామసభ నిర్వహిస్తారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రమాణం చేయడానికి ప్రతిజ్ఞను పంచాయతీరాజ్‌శాఖ రూపొందించింది. అన్ని జిల్లాలు, మండలాలకు పంపించారు. వీటిని ఆయా గ్రామాలకు నియమించిన స్పెషల్‌ఆఫీసర్లు చదివించి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మూడు విడతల్లో ఈనెల 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాలను అదేరోజు ప్రకటించారు. 12,702 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు, 1,11,803 వార్డుల సభ్యులు ఎన్నికయ్యారు.
పట్టాలెక్కనున్న అభివృద్ధి
22 నెలలుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. స్పెషల్ఆఫీసర్ల పాలన కొనసాగింది. స్పెషల్ఆఫీసర్లకు పూర్తి అధికారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిధులు విడుదల కాకపోవడం, మరో వైపు స్పెషల్ ఆఫీసర్లకు అధికారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. ఈ నేపథ్యంలో వచ్చే మార్చి కల్లా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. కేంద్రం నుంచి దాదాపుగా రూ.మూడు వేల కోట్ల వరకు నిధులు రావాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. వీటిని సాధించుకుంటే, కేంద్రం వెంటనే నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో పేరుకపోయిన బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. కొత్తగా అబివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. పారిశుద్ధ్యం, గ్రీనరీ, ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలకవర్గాల ద్వారా గ్రామ పంచాయతీలు కొత్త పంథాలో నడవాలని ఆశిస్తున్నారు.
ప్రమాణ స్వీకారం ఇదే..
‘గ్రామపంచాయతీ సర్పంచ్ నైనా.. అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి, నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర/సత్యనిష్ఠతో ప్రమాణం చేయచునున్నాను.’.. అని ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
యువరక్తానికి పాలకపగ్గాలు
కొత్త పాలకవర్గాలకు వర్గాలకు అత్యధికులు యువకులు, ఉన్నత విద్యావంతులు ఎన్నికయ్యారు. 50శాతం కంటే ఎక్కువ గ్రామాలకు మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వీరికి గ్రామసమస్యలపై అవగాహన ఉండటం, గ్రామ సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్నవారే కావడంతో గ్రామంలోని సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. మరోవైపు ప్రతి గ్రామానికి ఒక గ్రామ కార్యదర్శి ఉండతంతో ఇరువురు కలిసి గ్రామాభివృద్ధికి బాటలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొత్త సర్పంచ్‌లుగా ఎన్నికైన వారు పాలకవర్గ సమావేశాల్లో చేసిన తీర్మాణాలను అమలు చేయించే బాధ్యత సర్పంచ్తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ కార్యదర్శి ద్వారా వాటిని అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
సర్పంచ్ బాధ్యతలు ఇవే..
– గ్రామసభ, పారిశుద్ధ్యం నిర్వహణ సర్పంచ్ లదే.
– గ్రామాభివృద్ధి ప్రణాళికలను గ్రామసభలో ఆమోదం పొందాల్సి ఉంటుంది.
- కేంద్రం, రాష్ట్రం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ నిధులతో ప్రణాళికలు రూపొందించాలి.
– గ్రామ ప్రజలకు గ్రీనరీ, మొక్కల పెంపకం, నర్సరీ, గ్రామంలో విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యసేవలు అందించాలి.
– సర్పంచ్గ్రామంలో నివసించాలి. ప్రతిరోజు తప్పనిసరిగా పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలి.
– సర్పంచ్తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్‌చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంది.
– ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. సర్పంచ్లేకపోతే ఉపసర్పంచ్అధ్యక్షత వహించాలి.
– గ్రామసర్పంచ్గ్రామసభలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కూడా ఆహ్వానించవచ్చు.






