RTC Strike : ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా

by Muthe.Rajitha |   (  Updated:2025-05-06 10:13:11  IST  )

రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC Strike) వాయిదా పడింది.

RTC Strike : ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్ : రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె(RTC Strike) వాయిదా పడింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఈనెల 7 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో చర్చలు జరిపిన జేఏసీ నాయకులు.. తమ డిమాండ్లకు ప్రభుత్వం సమ్మతించడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్టు వెల్లడించారు.

కాగా ఉద్యోగుల సమస్యలపై అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్ సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Next Story