మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..ఏకంగా రూ.6700 కోట్లు !

by velandi.Saikiran |   (  Updated:2025-07-22 06:07:08  IST  )

తెలంగాణ ఆర్టీసీ.. మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని

మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ..ఏకంగా రూ.6700 కోట్లు !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ.. మరో మైలురాయి దాటింది. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. దింతో మహిళలు ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లుగా నమోదు అయినట్లు ఆర్టీసీ పేర్కొంది. ఉచిత బస్సు పథకం కోసం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ తరుణంలోనే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్ లలో సంబరాలు జరుపనున్నారు.

ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా.... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు... రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా.. ఉచితంగా ప్రయాణించే లాగా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆర్టీసీ బస్సు ఎక్కి కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. ఇలా దాదాపు 18 నెలలుగా ఈ ఉచిత బస్సు పథకం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది.

Next Story