తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ.. సీఎంకు ఖ‌ర్గే, ప్రియాంక ప్రశంసలు

by Kema Shiva Kumar |

ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ (Telangana Vision Document) ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఏఐసీసీ చీఫ్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ.. సీఎంకు ఖ‌ర్గే, ప్రియాంక ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యూచర్ సిటీ (Future City) వేదికగా తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ (Telangana Vision Document) ఆవిష్కరణపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఏఐసీసీ చీఫ్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ భ‌విష్యత్తు ముఖ‌చిత్రాన్ని విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించింద‌ని అన్నారు. ఇవాళ ఢిల్లీలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేతో పాటు ప్రియాంక గాంధీల‌ను వారి నివాసాల్లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ విజ‌యవంత‌మైన తీరు, తెలంగాణ రైజింగ్ విజ‌న్ డాక్యుమెంట్ ఆవిష్కర‌ణ‌పై వారి మ‌ధ్య చ‌ర్చ కొన‌సాగింది. స‌మ్మిట్‌లో రాష్ట్రానికి భారీగా పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు ఒప్పందాలు చేసుకోవ‌డంపై అగ్ర నేత‌లు సీఎంను అభినందించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్‌, మందాడి అనిల్‌కుమార్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, మ‌ల్లు ర‌వి, కుందూరు ర‌ఘువీర్‌రెడ్డి, గ‌డ్డం వంశీకృష్ణ ఉన్నారు.

Next Story