CM Revanth Reddy: నేను చెప్పినప్పుడు నమ్మలేదు.. హెచ్ సీఎల్ టెక్ న్యూ ఆఫీస్ ఓపెనింగ్ లో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-02-27 07:24:38  IST  )

హెచ్ సీఎల్ టెక్ న్యూ ఆఫీస్ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

CM Revanth Reddy: నేను చెప్పినప్పుడు  నమ్మలేదు.. హెచ్ సీఎల్ టెక్ న్యూ  ఆఫీస్ ఓపెనింగ్ లో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ప్రపంచంచ స్థాయి నగరంగా వేగంగా ఎదుగుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లో గురువారం హెచ్ సీఎల్ టెక్ నూతన క్యాంపస్ ను (HCL Tech Office) సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మల్టినేషనల్, బడా కార్పొరేట్ సంస్థలతో హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని ప్రతి రోజు నేను ఈ సంస్థలతో ఎంవోయూలు, లేదా కార్యాలయాల ప్రారంభోత్సవాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే హయ్యెస్ట్ ఇన్వెస్ట్ మెంట్లు రాబట్టగలిగామన్నారు. ఉద్యోగాల కల్పనపై ఫోకస్ పెట్టామని, ఎక్కువ ఏఐ వినియోగం తక్కువ ద్రవోల్బణంతో ముందుకు వెళ్తున్నారు చెప్పారు. తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ జీడీపీ స్టేట్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అయితే కొంత మంది ఇది అసాధ్యం అంటున్నారన్నారు. కానీ తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు, కుదుర్చుకుంటున్న ఒప్పందాలు చూశాక తెలంగాణ ఎదుగుదలను ఆపలేమని అందరు అంగీకరించక తప్పడం లేదన్నారు. నా పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచస్థాయి నగరంలో తీర్చిదిద్దేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. తెలంగాణలో కొత్త ఈవీ పాలసీ తీసుకువచ్చాం. డేటా సెంటర్ హబ్ గా రాష్ట్రాన్ని మార్చుతున్నామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని తెలంగాణ రైజింగ్ (Telangana Rising) అంశాన్ని నేను ప్రస్తావిస్తే తొలుత అందరూ సందేహాలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తున్నదన్నారు. లైఫ్ సైన్సెస్ లో ప్రపంచంలోనే మేటీ అయిన ఆమ్ జెన్ సంస్థలను ఆహ్వానించాం. బయో ఆసియా 2025 సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. హెచ్ సీఎల్ భారతదేశాన్ని గర్వంపడేలా చేస్తోందని 60 దేశాల్లో 2.2 లక్షల మందితో పని చేస్తున్నదని కొనియాడారు. 2007 లో హైదరాబాద్ లో అడుగుపెట్టిన హెచ్ సీఎల్ ఇప్పుడు భారీగా ఎదిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా హెచ్ సీఎల్ కూడా తెలంగాణలో అద్భుతంగా పని చేస్తున్నదన్నారు.

నైపుణ్యాల కోసమే యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్‌బాబు

యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu),వెల్లడించారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రాన్ని 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అందుకే ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Next Story