Telangana rising: తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-29 05:37:20  IST  )

తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. గ‌తంలోని లోగోకు ప్ర‌భుత్వం 2047ను యాడ్ చేసింది. అంతే కాకుండా లోగో లోని నంబ‌ర్ 1 అంకె మ‌ధ్య‌లో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉద‌యిస్తున్న సూర్యుడి గుర్తును ఏర్పాటు చేశారు. ఇక గ‌తంలోని తెలంగాణ రైజింగ్ లోగోను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడాది పూర్తైన సంద‌ర్భంగా తీసుకువ‌చ్చారు. దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ 1గా ఎదుగుతుంద‌నే విష‌యాన్ని తెలిపేలా లోగోలో నంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. నంబ‌ర్ 1 అంకె మ‌ధ్య‌లో ఓ గుండ్ర‌టి చక్రంలో తెలంగాణ మ్యాప్ ఉండేలా త‌యారు చేశారు. అన్ని అధికారిక వెబ్ సైట్స్‌తో పాటూ ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల వెబ్ పోర్ట‌ళ్ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఈ లోగోనే ద‌ర్శ‌నం ఇచ్చింది. ఇక తాజాగా ప్రభుత్వం కొత్త లోగోను విడుదల చేయడంతో ఇదే లోగో అధికారిక వెబ్ సైట్స్‌పై కనిపించనుంది.

Telangana rising: తెలంగాణ రైజింగ్ కొత్త లోగో విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రైజింగ్ కొత్త లోగోను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. గ‌తంలోని లోగోకు ప్ర‌భుత్వం 2047ను యాడ్ చేసింది. లోగో లోని కింది భాగంలో తెలంగాణ రైజింగ్ 2047 అని రాసి ఉంది. అంతే కాకుండా లోగో లోని నంబ‌ర్ 1 అంకె మ‌ధ్య‌లో తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉద‌యిస్తున్న సూర్యుడి గుర్తును ఏర్పాటు చేశారు. ఇక గ‌తంలోని తెలంగాణ రైజింగ్ లోగోను కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడాది పూర్తైన సంద‌ర్భంగా తీసుకువ‌చ్చారు. దేశంలోనే తెలంగాణ నంబ‌ర్ 1గా ఎదుగుతుంద‌నే విష‌యాన్ని తెలిపేలా లోగోలో నంబ‌ర్‌ను ఏర్పాటు చేశారు. నంబ‌ర్ 1 అంకె మ‌ధ్య‌లో ఓ గుండ్ర‌టి చక్రంలో తెలంగాణ మ్యాప్ ఉండేలా త‌యారు చేశారు. అన్ని అధికారిక వెబ్ సైట్స్‌తో పాటూ ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల వెబ్ పోర్ట‌ళ్ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు ఈ లోగోనే ద‌ర్శ‌నం ఇచ్చింది. ఇక తాజాగా ప్రభుత్వం కొత్త లోగోను విడుదల చేయడంతో ఇదే లోగో అధికారిక వెబ్ సైట్స్‌పై కనిపించనుంది.

Next Story