ప్రారంభమైన "తెలంగాణ రైజింగ్‌" గ్లోబల్‌ సమ్మిట్

by Muthe.Rajitha |   (  Updated:2025-12-08 08:38:25  IST  )

"తెలంగాణ రైజింగ్‌" పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్ అట్టహాసంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభమైంది.

ప్రారంభమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్
X

దిశ, వెబ్ డెస్క్ : "తెలంగాణ రైజింగ్‌" పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమ్మిట్ అట్టహాసంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్‌ సిటీలో జరుగుతున్న ఈ సమ్మిట్ కు తెలంగాణ గవర్నర్ తోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు దేశాల సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు, 2 వేల మంది ప్రముఖ అతిధుల హాజరయ్యే ఈ రెండు రోజుల సమిట్‌కు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాట్లు చేశారు.

గ్లోబల్ సమ్మిట్ ప్రారంభానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి డిజిటల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను పరిశీలించి సూచనలు చేసారు. తెలంగాణ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్‌ 2047 లక్ష్యాలు, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ ప్రణాళికపై సీఎం రేవంత్‌రెడ్డి మరికొద్దిసేపట్లో ఈ సమావేశంలో వివరించనున్నారు.

Next Story