- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CORE, PURE, RARE రీజియన్లుగా తెలంగాణ: CM రేవంత్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్‌తో రెండు ప్రధానమైన అంశాలు ఉన్నాయని.. ఒకటి విజన్ అయితే.. ఇంకోటి స్ట్రాటజీ అని తెలిపారు. ఈ డాక్యుమెంట్ రూపకల్పనలో ప్రముఖులు, నిపుణుల సలహాలు తీసుకున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ORR లోపల ప్రాంతంలో వివిధ విభాగాల పాలన ఉంది. అందుకే ఈ ప్రాంతం మొత్తాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా, ORR, RRR మధ్య ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజియన్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రాంతాన్ని మ్యానుఫాక్చరింగ్ జోన్‌గా మారుస్తామని చెప్పారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నగరం నుంచి కాలుష్యకారకమైన పరిశ్రమలు బయటకు తరలిస్తామని అన్నారు. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్‌పోర్టుల అవసరం ఉంది. గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, బుల్లెట్ రైళ్ల కోసం కేంద్రాన్ని ఒప్పిస్తున్నట్లు తెలిపారు.
స్ట్రాటజీలో భాగంగా తెలంగాణను మూడు విభాగాలుగా తీసుకున్నాం. CORE, PURE, RARE రీజియన్లుగా తెలంగాణను విభజించి అభివృద్ధి చేస్తాం. సమగ్రంగా ఈ మూడు రీజియన్ల అభివృద్ధిని సమగ్రంగా చేపడతాం.. అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా మా విజన్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 2047 నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ ఎకనామీగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






