- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 25తో ముగియనున్న తెలంగాణ రైజింగ్-2047 సర్వే
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ, వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేను చేపట్టింది. ఈ సర్వేలో పౌరులు పాల్గొని అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ ఆన్‌లైన్ సర్వే అక్టోబరు 25తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు www.telangana.gov.in /telanganarising అనే వెబ్‌సైట్‌ను సందర్శించి వారి వారి సలహాలు, సూచనలను అందించాల్సింగా ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది.






