కష్టాల్లో ఉన్న రైస్​మిల్లు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి

by Naga Rani Yarlagadda |

రైతులు పండించిన ధాన్యం సీఎంఆర్​ చేసేందుకు వెంటనే రైస్​మిల్లులకు కేటాయించి మిల్లులను ఆదుకోవాలని రైస్ మిల్లర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.

కష్టాల్లో ఉన్న రైస్​మిల్లు పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలి
X
  • మిల్లుల పెనాల్టీ, వడ్డీ మాఫీ చేసి సీఎంఆర్​కు ధాన్యం కేటాయించాలి : రైస్​మిల్లర్ల అసోసియేషన్​

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైస్​మిల్లర్ల పరిశ్రమ చాలా కష్టాల్లో ఉందని, రైతులు పండించిన ధాన్యం సీఎంఆర్​చేసేందుకు వెంటనే రైస్​మిల్లులకు కేటాయించి మిల్లులను ఆదుకోవాలని రాష్ట్ర రైస్​మిల్లర్ల వెల్ఫేర్​అసోసియేషన్​అధ్యక్షులు పాడి గణపతి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తెలంగాణ వ్యాప్తంగా 350 నుంచి 400 రైస్ మిల్లులు 100 శాతం బియ్యం సరఫరా చేసి 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డిలేని డిఫాల్ట్​లిస్టులు ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈమిల్లుల పెనాల్టీ, వడ్డీ మాఫీ చేసి రబీ సీజన్​కు సంబంధించిన ధాన్యం కేటాయించాలని కోరారు. నేడు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వ పెద్దలు తమ సమస్యలను పరిష్కరించి పరిశ్రమను కాపాడాలని సూచించారు. అదే విధంగా రైతులకు ధాన్యం సమస్య రాకుండా మిల్లర్లకు కేటాయిస్తే సకాలంలో సీఎంఆర్​చేసి అందిస్తామని పేర్కొన్నారు.

Next Story