నేటి నుంచి వారం రోజుల పాటు వర్షాలు

by velandi.Saikiran |

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్త

నేటి నుంచి వారం రోజుల పాటు వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్ :తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసింది. దాదాపు వారం రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రం తో పాటు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్సులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 5 అంటే రేపు రాయలసీమలో అత్యంత భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తమిళనాడు, యానాం అటు మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే దాదాపు పది రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పడబోతున్న నేపథ్యంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story