రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు

by velandi.Saikiran |   (  Updated:2025-08-15 02:13:01  IST  )

రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

రాష్ట్రంలో రెండు రోజులు భారీ వర్షాలు
X

రాష్ట్రంలో రెండు రోజు భారీ వర్షాలు

-కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

-అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 20 సెం.మీ వర్షాపాతం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమరం భీం అసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో అక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులు, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు రాష్ట్రంలో పలుప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.

అత్యధికంగా కల్వకుర్తిలో 20 సెం.మీ వర్షాపాతం

గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 20 సెం.మీ వర్షాపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వికారాబాద్ జిల్లా పరిగిలో 15 సెం.మీ, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో 12 సెం.మీ, వికారాబాద్ జిల్లా దోమ లో 12 సెం.మీ, ఖమ్మం జిల్లా మధిర లో 12 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో 12 సెం.మీ, అశ్వరావు పేట్ 11 సెం.మీ, దుమ్ముగూడెంలో 11 సెం.మీ, సూర్యాపేట్ జిల్లా కోదాడలో 11 సెం.మీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 11 సెం.మీ, వనపర్తి జిల్లా ఖిలా ఘన్పూర్ లో 11 సెం.మీ, గోపాల్ పేట్ లో 11 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో 10 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story