- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
National Defense: నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కు తెలంగాణ ప్రజా ప్రతినిధుల విరాళం.. సీఎం నిర్ణయం!
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ (National Defense Fund)కు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు (Donate one month's salary) ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు. సీఎం సూచన మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చించి ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించనున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించాలని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
కాగా, (India-Pakistan border) భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జమ్మూలో పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి పాకిస్తాన్, పీవోకేలో ఉన్న ఉగ్రస్థావరాలపై ఎయిర్‌స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది. డ్రోన్ల సహాయంతో భారత సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అందుకు భారత్ సైతం దాడులను సమర్ధవంతంగా తిప్పి కొడుతోంది.






