షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి.. శానిటైజర్ వాడండి: తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక

by Gantepaka Srikanth |

ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ(Telangana Public Health Department) ప్రజలకు కీలక సూచనలు చేసింది.

షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి.. శానిటైజర్ వాడండి: తెలంగాణ ప్రజలకు ఆరోగ్యశాఖ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ(Telangana Public Health Department) ప్రజలకు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా సమీప ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తలుపులు కిటికీలను దోమలు రాకుండా తెరలతో కప్పివేయాలని సూచించింది. సెప్టిక్ ట్యాంక్ ఇతర నీటి నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు సంతాన ఉత్పత్తి చేస్తాయని ఆయా ప్రాంతాల్లో మెష్‌లను వాడి పరిశుభ్రంగా ఉంచాలని కోరింది. ఇక వడకాచిన నీటిని మాత్రమే తాగాలని, భోజనానికి ముందు తర్వాత చేతుల పరిశుభ్రంగా కడగాలని కోరింది. బయట పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని, ఇవి ఫుడ్ పాయిజన్‌కి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది.

బయట వ్యక్తులతో కరచాలనం వీలైనంతగా తగ్గించాలని, శానిటైజర్ వాడడం ద్వారా పరిశుభ్రత మెయింటైన్ చేయాలని కోరింది. ఎవరైనా జలుబు జ్వరం లాంటి లక్షణాలతో బాధపడితే వీలైనంత త్వరగా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని కోరింది. ఇక స్థానిక ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, సిబ్బంది సహకారం తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు సూచించింది.

Next Story