రబీలో 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

by Naga Rani Yarlagadda |

యాసంగిలో ధాన్యం సేకరణ జోరుగా జరిగింది. 12.38 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.

రబీలో 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
X
  • రైతుల ఖాతాలో రూ.1129 కోట్లు జమ : పౌరసరపరాల శాఖ

దిశ, తెలంగాణ బ్యూరో : యాసంగి సీజన్​కు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది.1.54 లక్షల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కనీస మద్దతు ధర కింద రూ.1,129.43 కోట్లు జమ చేసింది. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ప్రస్తుతం, 8,575 వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపడుతోంది. ఇందులో 4,455 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 3,563 కేంద్రాలను ఇందిరా క్రాంతి పథం, మిగిలిన 557 కేంద్రాలను ఇతర సహాయక సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు 5.07 లక్షల మెట్రిక్​టన్నలు సన్న రకం, 7.31 లక్షల మెట్రిక్​టన్నుల దొడ్డు ధాన్యం సేకరించారు. క్షేత్రస్థాయిలో నిల్వలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నివారించేందుకు, అధికారులు వేగవంతమైన రవాణా చర్యలను అమలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన వరిని కొనుగోలు కేంద్రాల నుండి నేరుగా, ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత మిల్లులకు నిరంతరం తరలిస్తున్నారు. నిజామాబాద్, నల్గొండ, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వరి సేకరణ వేగంగా జరుగుతుంది.

Next Story