బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ప్రైవేటు కాలేజీల సమ్మె వాయిదా

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-08 13:08:58  IST  )

తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది.

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ప్రైవేటు కాలేజీల సమ్మె వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేసినట్లు తెలిపింది. పెండింగ్ లో ఉన్న రూ.1000 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. ఈనెల 13వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రైవేటు, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ కాలేజీలు సమ్మె చేస్తాయని వారంరోజుల క్రితం తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. దీపావళి నాటికి ప్రైవేటు కాలేజీల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో రూ.300కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సమ్మెను వాయిదా వేస్తూ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 23వ తేదీ నుంచి కాలేజీల బంద్ చేపడుతామని సమాఖ్య తెలిపింది.

Next Story