- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డీ అడిక్షన్ సెంటర్ అధికారిక లోగో ఆవిష్కరణ
తెలంగాణ జైళ్ల శాఖ జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న డ్రగ్స్ నిరోధక వారోత్సవాల్లో భాగంగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జైళ్ల శాఖ జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. హైదరాబాద్ సెంట్రల్ జైలులో జరిగిన ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పాల్గొని, నివృత్తి డీ అడిక్షన్ సెంటర్ అధికారిక లోగోను ఆవిష్కరించారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేవలం శిక్షలతోనే నేర ప్రవృత్తిని మార్చలేమని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం, చికిత్స అందించడం ద్వారానే పునరావాసం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సెంట్రల్ జైళ్లు, మహిళా జైళ్లలో ఖైదీలకు కౌన్సెలింగ్, నిర్వహించారు. 2024 జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం 15,645 మంది ఖైదీలకు మాదకద్రవ్యాల వినియోగంపై స్క్రీనింగ్ నిర్వహించారు. జైలులోకి వచ్చే ప్రతి 100 మంది ఖైదీలలో 81 శాతం మందికి విధిగా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 4,200 మంది వ్యసనపరులుగా గుర్తించబడగా, వారికి నివృత్తి కేంద్రాల ద్వారా మెరుగైన చికిత్స, పునరావాసం కల్పించాము. ఈ ఏడాదిలో 4,100 వ్యక్తిగత కౌన్సెలింగ్‌లు, 1,150 ఫాలోఅప్ సెషన్లు, 317 అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని.. జైలు నుంచి విడుదలైన 550 మందికి టెలిఫోన్ ద్వారా ఫాలోఅప్ సేవలు అందిస్తూ, వారు మళ్లీ వ్యసనాల బారిన పడకుండా చూస్తున్నారు అని అమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జైళ్ల ఐజీ ఎన్. మురళీబాబు, సూపరింటెండెంట్ ఎన్. శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






