- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అసెంబ్లీలో తెలంగాణ రాజకీయంపై రగడ.. ఇక్కడ క్రెడిట్ వార్ అక్కడ వర్సెస్ బ్లేమ్ వార్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై (Rayalaseema Lift Irrigation Project) ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. రాయలసీమ ప్రాజెక్టు పనుల నిలుపుదల క్రెడిట్ తమదంటే తమదే అని గతంలో తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ శాసనమండలిలో రీసౌండ్ వచ్చింది. రేవంత్ (Revanth Reddy) సర్కార్‍తో చంద్రబాబు లాలూజీ పడ్డారని మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) డిమాండ్ చేయగా దీనికి మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) స్పందిస్తూ గత వైసీపీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టిందంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల అంశంపై ఇప్పుడు ఏపీ శాసనమండలిలో వైసీపీ, టీడీపీ (Telugu Desam Party) మధ్య మాటల యుద్ధం సాగడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‍గా మారింది.
మీరు ద్రోహులు.. మీరే దద్దమ్మలు:
రాయయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి నేనే నిలిపి వేయించానని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని మండలిలో బొత్సా సత్యనారాయణ, ఆ పార్టీ సభ్యులు ఇషాక్ బాషా, రామసుబ్బారెడ్డి అధికార పక్షాన్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం సీఎం మన రాష్ట్ర సీఎం పేరు చెప్పి ఈ ప్రాజెక్టును అడ్డుకున్నారని చెబుతుంటే ఇది వాస్తవం కాదని మంత్రి వర్గం, సీఎం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు క్లారిటీగా చెప్పడం లేదని రాయలసీమకు ద్రోహం జరుగుతంటే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికార పక్షం ధ్వంధ్వ వైఖరి బయటపడుతోందన్నారు. బొత్సా వ్యాఖ్యలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మత్రి పయ్యావుల కేశవ్. నాటి చేతగాని, దద్ధమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని వైసీపీపై మండిపడ్డారు. వైసీపీ హయాంలోనే ఆ ప్రాజెక్టును ఎన్జీటీ ఆపిందని తాము చెప్తే జగన్ ఆపారని హరీశ్ రావు అసెంబ్లీలోనే చెబితే దానికి మేము సమాధానం చెప్పాలా అని మండిపడ్డారు. మంత్రి నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాగునీటి కోసం కాదు.. తాగునీటి కోసమని వైసీపీ (YSR Congress Party) ప్రభుత్వం 2023 ఆగస్ట్ 18న జీవో నంబర్ 364 సహా అఫిడవిట్ ఇచ్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై ఎక్కడా సమాధానం ఇవ్వలేదంటూ వైసీపీ నిరసన వ్యక్తం చేయడంతో సభ పలు మార్లు వాయిదా పడింది.
ఇక్కడ క్రెడిట్ వార్ అక్కడ బ్లేమ్ వార్:
రాయలసీమ ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సాగుతున్న రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రాయలసీమ పనులు ఆపామంటూ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ వార్ సాగగా ఇవే పనులు అపడం వెనుక మేమంటే మేము లేమని ఏపీలోని వైసీపీ, టీడీపీ మధ్య బ్లేమ్ వార్ రాజకీయం సాగింది. కాగా గత జనవరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించాను. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలని నేను సాధించిన విజయాన్ని ఇంత వరకు చెప్పుకోలేదు. రాయలసీమ ప్రాజెక్టును ఆపితేనే మేము మీతో ఏదైనా విషయాలపై చర్చకు వస్తామని సూటిగా చంద్రబాబు నాయుడుకు నేను క్లోస్డ్ రూమ్‍లో విజ్ఞప్తి చేస్తే మా మీద ఉన్న గౌరవంతో ఆపేశారని చెప్పారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ తర్వాత తెలంగాణ భవన్ లో మాట్లాడిన హరీశ్ రావు (Harish Rao) రాయలసీమను ఆపింది మేమే అని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టు జీవో 2020, మే 5న వచ్చిందని, దానికి ఆరు నెలల ముందే ఆ ప్రాజెక్టును తెలంగాణ అంగీకరించబోదని, అది చట్టవిరుద్ధమని, తక్షణం ఆపాలని కేంద్రానికి, కేఆర్‌ఎంబీకి లేఖల ద్వారా కేసీఆర్ ఫిర్యాదు చేశారని అన్నారు. నెల క్రితం తెలంగాణలో రాజయ వేడి రాజేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ఫైర్ అవుతున్నాయి.






