ఒక్క క్షణం ఆలోచించు.. జీవితాన్ని జయించు

by Gantepaka Srikanth |

ఒక్క క్షణం ఆలోచించు.. జీవితాన్ని జయించు

ఒక్క క్షణం ఆలోచించు.. జీవితాన్ని జయించు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానీ చేస్తుందో జనాలు కూడా ఎక్కువగా దానికే అడిక్ట్ అవుతున్నారు. ఉదాహరణకు సిగరేట్, ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయో అందరికీ తెలుసు. తెలిసి కూడా ఏమాత్రం ఆలోచించకుండా లాగించేస్తుంటారు. అలాగే డ్రగ్స్ కూడా.. డ్రగ్స్ మూలంగా కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడ్డ సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా యువకులు మారడం లేదు. చిన్న వయసులోనే డ్రగ్స్‌కు అడిక్ట్ అయి ఆరోగ్యాన్ని ఛిద్రం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో కొంతైన మార్పు రావాలని సోసల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా దీనిపై నెట్టింట పోస్టు పెట్టారు. ‘ఆ ఒక్క క్షణాన్ని జయిస్తే చాలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. మాదక ద్రవ్యాల జోలికి అస్సలు వెళ్లకండి. సరదా కోసం కూడా ప్రయత్నిచకండి. డ్రగ్స్‌ తీసుకుంటే ఆరోగ్య సమస్యలతో పాటూ మీ కుటుంబాన్ని మానసికంగా క్షోభకు గురిచేసిన వారవుతారని గుర్తుంచుకోండి’ అని పోలీసులు పేర్కొన్నారు.

Next Story