Second Hand Mobile: సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? తెలంగాణ పోలీస్ హెచ్చరిక

by Ramesh Naini |

సాధారణంగా చాలా మంది తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ కొనడానికి ఇష్టపడుతుంటారు.

Second Hand Mobile: సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా..? తెలంగాణ పోలీస్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా చాలా మంది తక్కువ ఖర్చుతో మంచి ఫీచర్స్ ఉన్న మొబైల్ కొనడానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే అధిక ధర పెట్టని వారు సెకండ్ హ్యాండ్‌ మొబైల్స్ (Second Hand Mobile) కొనే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే తక్కువ ధరకు ఫోన్ రావడంతో సెకండ్ హ్యాండ్ కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో దేశంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్‌ల మార్కెట్ సైతం వేగంగా పేరుగుతోందని వార్తలు వచ్చాయి. ఈ ఫోన్‌లు స్థానిక మార్కెట్‌లలో లేదా వివిధ అన్‌లైన్ యాప్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేవారికి తెలంగాణ పోలీస్ (Telangana Police) శాఖ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? జాగ్రత్తా.. అంటూ తెలంగాణ పోలీస్ తన అధికారిక ఖాతా ద్వారా ఆసక్తికర పోస్ట్ చేసింది.

తెలియని వ్యక్తుల దగ్గరైనా.. మొబైల్ షాప్‌లో అయినా.. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు జాగ్రత్త వహించండని హెచ్చరించింది. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేముందు ఒక్కసారి ఆలోచించాలని, తెలియని వారు ఎవరైనా తక్కువ ధరకే ఫోన్ అమ్ముతామని చెప్తే అనుమానించాల్సిందేనని, చోరీకి గురైన ఫోన్‌ను మీకు అమ్మే అవకాశం ఉంటుందని సూచించింది. కాబట్టి ముందుగా ఫోన్ కొనేముందు https://www.sancharsaathi.gov.in/ కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్‌ చేసుకోవాలని తెలిపింది. తక్కువకు వస్తోందని చోరీకి గురైన ఫోన్ కొని చిక్కుల్లో పడొద్దని హెచ్చరించింది.




Next Story