అశ్లీల చిత్రాలు చూస్తే నేరం! పోర్న్ పోస్టింగ్స్‌ చేసే వారిపై నిఘా: తెలంగాణ పోలీస్

by Ramesh Naini |

భారత్‌లో చౌకగా స్మార్ట్‌ఫోన్లు డేటా అందుబాటులోకి రావడంతో కొంత మంది యువత చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

అశ్లీల చిత్రాలు చూస్తే నేరం! పోర్న్ పోస్టింగ్స్‌ చేసే వారిపై నిఘా: తెలంగాణ పోలీస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌లో చౌకగా స్మార్ట్‌ఫోన్లు డేటా అందుబాటులోకి రావడంతో కొంత మంది యువత చెడు వ్యసనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే టెలిగ్రామ్, స్నాప్ చాట్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా (pornographic) అశ్లీల చిత్రాలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌కు చెందన పుట్ట అనిల్ కొన్ని రోజులుగా తన ఫోన్‌లో మైనర్ల అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడు. కొన్ని అశ్లీల సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయాన్ని సైబర్ సెక్యూరిటీ అధికారులు గమనించి భూంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే (Telangana Police) తెలంగాణ పోలీస్ శనివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసింది.

‘అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడటం, షేర్ చేయడం కూడా నేరమే. పోర్నోగ్రఫీని ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దు. షేర్ చేసి చిక్కుల్లో పడకండి. లైకుల కోసం సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పోస్టింగ్స్‌, షేర్స్ చేసేవారిపై నిఘా ఉంటుందని గుర్తుంచుకోండి. అశ్లీల చిత్రాల్ని షేర్ చేసే వారి శిక్షలు ఎదుర్కొనక తప్పదని గుర్తుంచుకోవాలి’ అని కీలక సూచనలు చేశారు. ఇందుకు నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతున్నారు. మొదలు ఆయా సైట్స్‌ను తెలంగాణలో బ్యాన్ చేయాలని, సర్వర్లు ఆపాలని పోలీసులకు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రపంచంలోనే భారత్ మూడో ప్లేస్

ఇక, ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ నివేదిక ప్రకారం భారత్‌లో ఎక్కువగా అశ్లీల చిత్రాలు చూస్తున్నారని ఆ సంస్థ పేర్కొంది. అమెరికా, బ్రిటన్‌ల తర్వాత అత్యధికంగా భారత్‌లో చూస్తున్నారని తెలిపింది. ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని, భారత్‌లో ఎక్కువగా మొబైల్ ఫోన్లలోనే వీక్షిస్తున్నారని పేర్కొంది.

Next Story