- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Police: తెలియని యాప్స్, వెబ్‌సైట్లలో ఇన్వెస్ట్‌పై తెలంగాణ పోలీస్ హెచ్చరిక
మీరు సంపాదించే ప్రతి రూపాయి అమూల్యమైనదని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మీరు సంపాదించే ప్రతి రూపాయి అమూల్యమైనదని తెలంగాణ పోలీసులు (Telangana Police) పేర్కొన్నారు. ప్రతి రూపాయి ఆలోచించి పెట్టుబడి పెట్టండి అంటూ గురువారం తమ అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా హెచ్చరించారు. మీరు సంపాదించే ప్రతి రూపాయి అమూల్యమైనదని, అలాంటిది అపరిచితుల మాటలు నమ్మి వాటిని తెలియని యాప్స్, వెబ్‌సైట్లలో ఇన్వెస్ట్ చేయవద్దని సూచించారు. సులభంగా సంపాదించాలనే అత్యాశ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుందని గుర్తుంచుకోండని హెచ్చరించారు.
ఆన్‌లైన్‌లో ‘హై రిటర్న్’ ఇస్తామని చెప్పే మోసపూరిత యాప్స్, వెబ్‌సైట్లకు బలవుతుండవద్దని సూచించారు. సులభంగా డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మి పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు యాప్ లేదా వెబ్‌సైట్ విశ్వసనీయతను తప్పనిసరిగా ధృవీకరించాలని తెలిపారు. ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చాలా కీలకమైన నిర్ణయం అని, ఎవరైనా తెలియని వ్యక్తులు ఇన్వెస్ట్ చేయమని చెబితే నమ్మవద్దని వెల్లడించారు. ఈజీగా వచ్చే మనీ ఎప్పటికైనా ప్రమాదమేనని పేర్కొన్నారు. కొంత మొత్తమే కదా అని ప్రయోగాలు వద్దని, చిన్న మొత్తంలో అయినా అపరిచిత ప్లాట్‌ఫామ్‌ల్లో డబ్బు పెట్టొద్దన్నారు. ఇలాంటి మోసాల నుండి జాగ్రత్తగా ఉండేందుకు సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.






