- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Big Alert: పెళ్లి సంబంధాల కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి(Wedding) అనేది చాలా కీలకమైన ఘట్టం. ఏ విషయంలో తొందరపడినా.. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి(Wedding) అనేది చాలా కీలకమైన ఘట్టం. ఏ విషయంలో తొందరపడినా.. పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముందు, వెనుక ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెళ్లిళ్లు చేసుకుంటారు. కొందరు పెద్దలు కుదుర్చిన సంబంధాలతో ఒక్కటవుతుండగా.. ఇంకొందరు లవ్ మ్యారేజెస్ చేసుకుంటుంటారు. మరికొందరు మ్యాట్రిమోని(Matrimonial Websites)లపై ఆధారపడుతుంటారు. ఈ క్రమంలోనే గుర్తింపు లేని వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేస్తూ మోసపోతున్నారు. తాజాగా ఫేక్ వెబ్‌సైబ్‌లపై తెలంగాణ పోలీసులు(Telangana Police) కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ ఉండొచ్చు జాగ్రత్త. ఆకర్షణీయమైన ఫొటోలు చూసి మోసపోవద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులకు మీ వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అపరిచితుల్ని నమ్మకండి’’ అని ఎక్స్ వేదికగా హెచ్చరిక చేశారు.
మాట్రిమోనియల్ వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్స్ ఉండొచ్చు జాగ్రత్త. ఆకర్షణీయమైన ఫోటోలు చూసి మోసపోవద్దు. ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులకు మీ వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు. ఆర్ధిక సంబంధిత లావాదేవీల విషయంలో అపరిచితుల్ని నమ్మకండి.#telanganapolice pic.twitter.com/8lv5G574Hy
— Telangana Police (@TelanganaCOPs) June 3, 2025






