AIని మంచి కోసం మాత్రమే వాడండి.. తెలంగాణ పోలీస్ కీలక సూచనలు

by Ramesh Naini |   (  Updated:2025-12-15 12:36:33  IST  )

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం పెరుగుతోంది.

AIని మంచి కోసం మాత్రమే వాడండి.. తెలంగాణ పోలీస్ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వినియోగం పెరుగుతోంది. దీంతో ఏఐని కొందరు మంచి కోసం వాడుతుంటే.. మరికొంత మంది చెడుకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ నేరగాళ్లు కొత్త కొత్త పద్దతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం @TelanganaCOPs ఎక్స్ వేదికగా తెలంగాణ పోలీస్ ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను మంచికోసం మాత్రమే వాడాలని సూచించింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కోసం, ఫేక్ సమాచారాన్ని సృష్టించడం కోసం ఏఐని వాడొద్దని తెలిపారు. వ్యక్తులను కింద పరిచేందుకు ఏఐని ఉపయోగించవద్దని పేర్కొంది. ఇలా చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని గుర్తుంచుకోండని హెచ్చరించింది. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు మాత్రమే ఏఐని వాడాలని, అవగాహన కల్పించేందుకు ఏఐని వాడాలని సూచించింది. ఏఐని దుర్వినియోగం చేసి చిక్కుల్లో పడొద్దని తెలిపింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడకంలో జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ పోలీస్ ట్వీట్‌లో వీడియో పోస్ట్ చేసింది. ట్వీట్ ఇదే..

Next Story