TG Police: నాన్నంటే బంధం మాత్రమే కాదు.. బలం కూడా

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-15 05:04:26  IST  )

ప్రతీ ఒక్కరి జీవితంలో తండ్రే(Father) తొలి హీరో. తను ఎంత కష్టపడతాడో పిల్లలకు ఏనాడూ తెలియనీయడు.

TG Police: నాన్నంటే బంధం మాత్రమే కాదు.. బలం కూడా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఒక్కరి జీవితంలో తండ్రే(Father) తొలి హీరో. తను ఎంత కష్టపడతాడో పిల్లలకు ఏనాడూ తెలియనీయడు. పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితం మొత్తాన్ని త్యాగం చేస్తాడు. అలాంటి తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా జూన్ 15వ తేదీన ఫాదర్స్ డే(Father's Day) జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేడు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఫాదర్స్ డే గ్రీటింగ్స్ చెబుతున్నారు. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తెలంగాణ పోలీసులు(Telangana Police) విషెస్ చెబుతూ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘ప్రతి వ్యక్తికి తొలి హీరో నాన్న. కుటుంబ బాధ్యతలను మోస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే వ్యక్తి నాన్న. పిల్లల భవిష్యత్తే సర్వస్వంగా జీవించే ప్రతి ఒక్క తండ్రికి హ్యాపీ ఫాదర్స్‌ డే’ అని పేర్కొన్నారు. ట్విట్టర్ లింక్

నాన్నంటే బంధం మాత్రమే కాదు.. నాన్నంటే బలం

నాన్నంటే భయం కాదు.. నాన్నంటే బాధ్యత

నాన్నంటే సంతోషమే కాదు.. నాన్నంటే సర్వస్వం

కుటుంబం కోసం ఆయన త్యాగాలెన్నో..

పిల్లల కోసం చిందించిన చెమట చుక్కలెన్నో..

Next Story