- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Police: ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు.. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన సంస్కరణకు శ్రీకారం చుట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలతో అనుబంధం పెంచుకోవడం విషయంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్న తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బాధితుల ఇంటి వద్దే (complaint at doorstep) ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. పోలీస్ స్టేషన్‍కు రాని బాధితుల ఇంటి వద్దకే పోలీసులు రాబోతున్నారు. అన్ని ఫిర్యాదులు స్వీకరించేందుకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పోలీసు స్టేషన్ల వరకు వెళ్లి ఫిర్యాదు చేయలేని అనేక మంది బాధితులకు గొప్ప ఊరట ఇవ్వనుంది.
సత్ఫలితాలిస్తోన్న 'సీ-మిత్ర':
ఇదిలా ఉంటే ఇటీవల సైబర్ నేర బాధితుల కోసం సదుపాయాన్ని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభింభించిన సీ -మిత్రం మంచి ఫలితాలు ఇస్తోంది. సైబర్ నేర బాధితులు ఇంటి నుంచే ఫిర్యాదు చేస్తేసీ-మిత్రం టీమ్ ఆ వెంటనే రంగంలోకి దిగుతుంది. బాధితులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసి, ఏఐ సాంకేతికతతో లీగల్ అంశాలతో కూడిన పక్కా ఫిర్యాదు డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసి వాట్సాప్ లేదా మెయిల్‌కు పంపిస్తున్నారు. బాధితులు ఆ ఫిర్యాదును ప్రింట్ తీసుకొని, సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు కొరియర్ లేదా పోస్ట్ ద్వారా పంపాలి. ఆ కాపీ అందగానే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఆ వివరాలను బాధితుల మొబైల్‌కే మెసేజ్ రూపంలో పంపిస్తున్నారు.






