- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ కవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ సమాజంలోని వివక్ష, అణచివేత, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తనదైన ఆటపాటల ద్వారా పల్లెల్లో తిరుగుతూ ఉద్యమ భావజాలాన్ని పెంపొందించారు. ప్రకృతికి, మనిషికి ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ఆయన రాసి పాడిన అనేక పాటలు ఇప్పటికే ప్రజల నోళ్లలో నానుతూ నే ఉన్నాయి. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో జయరాజ్ చేసిన కృషికిగాను తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణ రావు అవార్డును అందజేసింది.
Next Story






