తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

by Ajay Maddhiboyina |

తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ 2026 క్యాలెండర్‌ను తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.

తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ 2026 క్యాలెండర్‌ను తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సమాజంలోని వాస్తవాలను, ప్రజల కష్టసుఖాలను తన కెమెరా కంటితో బంధించి ప్రపంచానికి చాటిచెప్పే ఫొటో జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ అద్భుతమైన చిత్రాలను క్లిక్ చేసే జర్నలిస్టులకు అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్ మాట్లాడుతూ టీపీజేఏ 11 ఏళ్లుగా నిరంతరాయంగా ఏటా ఈ క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్నదని చెప్పారు. ఫొటో జర్నలిస్టుల నైపుణ్యాన్ని, వారు తీసిన అరుదైన ఫొటోలను ఈ క్యాలెండర్ ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణకుమార్, నాయకులు యోగి, నవీన్‌యార, రాకేశ్‌రెడ్డి, బాపురావు, చిన్న యాదగిరి గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story